జొల్లు కార్చాడు.. 1.1 లక్షలు పోగొట్టుకున్నాడు

by Sumithra |
జొల్లు కార్చాడు.. 1.1 లక్షలు పోగొట్టుకున్నాడు
X

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలపై సైబర్‌క్రైమ్ పోలీసులు ఎంత అవగాహన కల్పించినా ఉపయోగం ఉండడంలేదు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ నమ్మి మోసపోవద్దని, ఫేస్‌బుక్ ఫ్రెండ్షిప్ రిక్వస్టులతో జాగ్రత్తగా ఉండాలని చెవినిల్లు కట్టుకుని చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఒక కేసు చూసి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాదులోని అశోక్ నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు బీటెక్ పూర్తి చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. ఆరు నెలల క్రితం ఫేస్‌బుక్ లో అనుష్క ఫోటో ప్రొఫైల్ పిక్చర్‌‌గా వచ్చిన రిక్వెస్ట్‌కి ఒకే చెప్పాడు. దీంతో అవతలి వ్యక్తి యువతిలా ఛాట్ చేసి, ఆర్థిక సమస్యలు ఏకరువు పెట్టడంతో వెయ్యి మొదలు 3 వేల రూపాయల చొప్పున పేటీఎం ద్వారా బదిలీ చేయించుకున్నారు. ఇలా మొత్తం 1.1లక్షల రూపాయలు ఫేస్‌బుక్ ఛాటింగ్ వ్యక్తికి సమర్పించుకున్నాడు. పాకెట్ మనీ మొత్తం ఇచ్చేసిన తరువాత కాల్ చేస్తే అటునుంచి సమాధానం రాకపోవడంతో మోసపోయినట్టు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అనుష్క ప్రొఫైల్ పిక్చర్ గా వచ్చిన అకౌంట్ తో ఛాట్ చేసి ఎలా డబ్బులు వేశావంటే తెల్లమొహం వేశాడు. దీంతో దర్యాప్తు ఆరంభించారు.

Advertisement

Next Story

Most Viewed