- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హ్యాపీ.. ఎందుకో తెలుసా?
దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందితో గురువారం కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గ్రీవెన్స్ సెల్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసుల సమస్యల పరిష్కారానికి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేశామని, సిబ్బంది నుంచి గ్రీవెన్స్ సెల్‌కు మంచి స్పందన వస్తోందన్నారు. గతవారం గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఈవారం వచ్చిన ఫిర్యాదులను, పెండింగ్ ఫైల్స్‌ను త్వరితగతిన క్లియర్ చేయాలని సూచించారు.
ముఖ్యంగా HRMS, సేవా పథకాల ప్రపోజల్స్, సినిమాటోగ్రఫీ పర్మిషన్లు, ఈవెంట్ పర్మిషన్లు, పెట్రోలియం పర్మిషన్లు తదితర అంశాలు చర్చకు వచ్చాయి. HRMS అప్లికేషన్లను వినియోగం పెంచి, మాడ్యూల్‌లపై ట్రైనింగ్ సెషన్లను ఏర్పాటు చేసి, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. గడచిన రెండేళ్లలో మరణించిన పోలీసు కుటుంబాలకు అందాల్సిన టర్మినల్ డెత్ బెనిఫిట్స్ వెంటనే అందేలా చేయాలన్నారు. సీఏఓలు, సెక్షన్ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలన్నారు. సిబ్బందికి సమస్యలుంటే గ్రీవెన్స్ సెల్ (8333993272) ద్వారా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్, శంషాబాద్ డీసీపీ ఎన్.ప్రకాష్ రెడ్డి, క్రైమ్స్ డీసీపీ రోహిణీ ప్రియదర్శిణి, ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీవింగ్ డీసీపీ అనసూయ, బాలానగర్ డీసీపీ పద్మజా, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, సీఆర్ హెడ్ క్వార్టర్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీలు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రకళ, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ గీత, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి, సీఐలు, ఎస్ఐలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.