- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
లాక్‌డౌన్ మరింత కఠినతరం: సజ్జనార్

దిశ, రంగారెడ్డి: లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేయబోతున్నామని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడొద్దనీ, ఇప్పటివరకూ మూడు లక్షల వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. సీజ్ చేసిన వాహనాలను ఇప్పట్లో ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లాక్‌డౌన్ తర్వాత కూడా వాహనాలు తీసుకోవడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెల్లడించారు. కంటైన్మెంట్ ఏరియాల్లో భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. విధుల్లో ఉన్న పోలీసులకు ఎప్పటికప్పుడూ వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామనీ, ఇప్పటికే వారికి మాస్కులు, గ్లౌజులు పంపిణీ చేశామన్నారు. వలస కూలీల సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు. ఇంటి అద్దె కోసం యజమానులు వేధింపులకు గురిచేస్తే సమాచారమివ్వాలని చెప్పారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీ స్పష్టం చేశారు.
Tags : Cyberabad CP Sajjanar, Press Meet, Lockdown, Siege, vehicles,rangareddy