కరోనా వేళ…సైబర్ వల

by  |   ( Updated:2021-04-21 05:31:11.0  )
కరోనా వేళ…సైబర్ వల
X

దిశ,హుజురాబాద్: కరోనా వేళా, సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలపై వల విసురుతున్నారని రూరల్ సీఐ ఎర్రల కిరణ్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… కరోనా సమయంలో అంత ఆన్ లైన్ ద్వారా ట్రాన్సక్షన్స్ జరుగుతున్నదని, సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాలను నేరగాళ్లు ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తూ, వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని సైతం చోరీ చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అవగాహన కలిగి ఉండాలిని, ఏమాత్రం ఏమరపాటుతో ఉన్న భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో అమెజాన్, నెట్ ఫ్లిక్ వంటి వాటి పేర ఫ్రీ ఆఫర్స్ అంటూ లింకులు పంపిస్తూ సైబర్ నేరగాళ్లు, మోసం చేయడానికి ప్రజలపై వల విసురుతున్నారన్నారు.

అలాంటి నకిలీ లింక్స్ ని మనం క్లిక్ చేయగానే మన ఫోన్ లోని డేటా, వ్యక్తిగత వివరాలతో పాటు పూర్తి సమాచారం వారికి చేరుతుందన్నారు. అందులో బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్ వర్డ్స్, పర్సనల్ ఫొటోలు తస్కరిస్తారన్నారు. ఓటీపీ ఎంటర్ చేయగానే మన ఫోన్ హ్యాక్ అవుతూ, అట్టి లింక్స్ మనకు తెలియకుండానే అన్ని గ్రూప్స్ లలో షేర్ అవడం జరుగుతుందన్నారు. పింక్ వాట్సాప్ అంటూ నకిలీ లింక్స్ పంపుతూ, అప్డేట్ చేసుకోండని మరో మోసానికి పాల్పడుతున్నారని తెలిపారు.

వాట్సాప్ అప్డేట్ ఉంటే అది మనకు వాట్సాప్ అప్ లో చూపెడుతుంది గాని ఇలా లింక్స్ రూపంలో రాదన్నారు. ముఖ్యంగా మన ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయడం గాని, చెప్పడం గాని చేయకూడదన్నారు. అనుమానిత వెబ్ సైట్స్ లో లాగిన్ అవుతూఓటీపీలను అసలే ఎంటర్ చేయొద్దన్నారు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు జరుగుతున్న వేళా పిల్లల వద్ద గలా ఫోన్ పై ఎప్పుడూ నిఘా ఉంచుతూ, వారు ఫోన్ ఉపయోగిస్తున్న విధానం పై తల్లిదండ్రులు పర్యవేక్షిస్తుంలన్నారు. ప్రజలు అందరూ ఆన్ లైన్ మోసాలపై అవగాహన కలిగి ఉండి, అనుమానిత, తెలియని, నకిలీ లింక్స్ గాని, వెబ్ సైట్స్ ని గాని క్లిక్ చేయకూడదని సూచించారు.

Advertisement

Next Story