- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లోన్ పేరుతో 30 వేలు కాజేసిన సైబర్‌నేరగాళ్లు..
దిశ, కూకట్పల్లి: ఈ నెల 8వ తేదీన మహేందర్ (50) అనే వ్యక్తి ధని యాప్ నుంచి కాల్ చేస్తున్నాము మీకు 75 వేల వరకు లోన్ప్రీ అప్రూవల్ ఉందంటూ 9064868418 నెంబర్ నుంచి కాల్వచ్చింది. దీంతో మహేందర్ తనకు లోన్కావాలని సమాధానం ఇచ్చారు. దీంతో మహేందర్అకౌంట్లో 7,400 రూపాయలు క్రెడిట్అయ్యాయి. ఆశ్చర్యపోయిన మహేందర్ తనకు కాల్ వచ్చిన నెంబర్‌కు ఫోన్‌చేసి తనకు లోన్వద్దు 75 వేలకు 7వేల 4 వందలు మాత్రమే వచ్చాయని చెప్పడంతో అవతలి వ్యక్తి లోన్ క్యాన్సిల్చేయడానికి మీ నెంబర్ కు ఓటిపి(OTP) వస్తుంది అది చెప్పండి అన్నడు.
దీంతో మహేందర్ఏమి ఆలోచించకుండా తనకు వచ్చిన ఓటిపి ని సదరు వ్యక్తికి చెప్పాడు. ఓటీపీ చెప్పిన కొద్ది సేపటికి 7 వేలు, 5 వేలు ఇలా రోజు కొంత మొత్తం మహేందర్అకౌంట్ నుంచి 30 వేల రూపాయల వరకు డెబిట్అయ్యాయి. అంతే కాకుండా తనకు ముందు వచ్చిన నెంబర్ తో పాటు మరో నంబర్నుండి కాల్ వస్తుండటంతో తన క్రెడిట్ కార్డు ను బ్లాక్ చేయించారు. తాను మోసపోయానని భావించిన మహేందర్ బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వహీదుద్దిన్ తెలిపారు.
ఇదిలా ఉండగా బాలానగర్ రామ్‌రెడ్డి నగర్‌కు చెందిన సురుకొంటి శ్రీనివాస్(35) హెచ్డీ ఎఫ్‌సి అకౌంట్నుంచి ఈ నెల 20వ తేదీన 3,999 రూపాయలు కట్అయినట్టు మెసేజ్వచ్చింది. అదే రోజు మధ్యాహ్నం 1:20 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ అమెజాన్ యాప్‌ద్వారా వాషింగ్ మిషన్ బాల్స్కొనుగోలు చేసి తన కార్డు ద్వారా డబ్బులు చెల్లించాడు. అమెజాన్ ద్వారా కొనుగోలు చేసిన తరువాత తన అకౌంట్నుంచి డబ్బులు మాయమయ్యాయని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాలానగర్పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.