‘సోషల్’ క్రైం : ఓనర్‌కు తెలియకుండా పల్సర్ బైక్ విక్రయం

by Sumithra |
bike
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ముల్లంగి గ్రామానికి చెందిన ఓ బైక్‌ను బెంగళూర్‌కు చెందిన కేటుగాడు అమ్మకానికి పెట్టాడు. సోషల్ మీడియాలో సదరు బైక్ ఫోటోలను అప్‌లోడ్ చేసి రూ.35 వేలకే అమ్ముతానంటూ డిటేల్స్ పోస్టు చేశాడు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో విషయం గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.

అయితే, సదరు కేటుగాడు తాను బెంగళూరు కెంప గౌడ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో సోల్జర్‌గా పని చేస్తున్నానని రికార్డులో చెబుతున్నా.. ఆ వివరాలన్నీ తప్పు అని పోలీసులు తేల్చారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తీకేయ ఒక ప్రకటన జారీ చేశారు. ఎవరూ కూడా సోషల్ మీడియాలో అమ్మకాల పేరిట వచ్చే వాటిని ముఖ్యంగా కేటుగాళ్ళ ఉచ్చులో చిక్కుకోవద్దని కోరారు. అమాయకులను మోసం చేసేందుకే కొందరు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారిపై నజర్ పెట్టినట్టు సీపీ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed