హైదరాబాద్ ఎన్ఐఎస్ఏకు సీవీ ఆనంద్ బదిలీ

by Shyam |
హైదరాబాద్ ఎన్ఐఎస్ఏకు సీవీ ఆనంద్ బదిలీ
X

దిశ, క్రైమ్ బ్యూరో: సెంట్రల్ సర్వీస్‌లో ఉన్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను సీఐఎస్ఎఫ్ విభాగం బదిలీ చేసింది. వీరిలో తెలంగాణ క్యాడర్ కు చెందిన ఐజీ సీవీ ఆనంద్‌తో పాటు అంజనా సిన్హా, దేవదత్ సింగ్, సుధీర్ కుమార్, డీఐజీ సచిన్ బాద్ షా ఉన్నారు. ప్రస్తుతం బెంగుళూరు ఏపీఎస్-2 హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న సీవీ ఆనంద్ ఎన్ఐఎస్ఏ హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. అంజనా సిన్హా హైదరాబాద్ ఎన్ఐఎస్ఏ నుంచి చెన్నయ్ సౌత్ సెక్టార్ హెడ్ క్వార్టర్స్‌కు, దేవ్‌దత్త సింగ్ న్యూఢిల్లీ పీఈఆర్ఎస్ నుంచి ఎఫ్‌హెచ్ క్యూ ఏడీఎంగా, సుధీర్ కుమార్ న్యూ ఢిల్లీ ఎన్సీఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి కోల్‌కతా ఎస్ఈఎస్ హెడ్ క్వార్టర్స్‌కు, సచిన్ బాద్ షా ఢిల్లీ డీఎంఆర్సీ నుంచి న్యూ ఢిల్లీ పీఈఆర్ఎస్‌కు బదిలీ అయ్యారు.

Advertisement

Next Story