- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 1-2-2023
అంతర్జాతీయం:
ఐఎస్ఐఎల్ అంతర్జాతీయ ఉగ్రసంస్థే: ఐరాస
ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవాంట్ (ఐఎస్ఐఎల్)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రకటించింది. మండలిలో 15 సభ్య దేశాలతో కూడిన 1267 కమిటీ ఏకాభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని వెలువరించింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను ప్రపంచవ్యాప్తంగా స్థంబింపజేస్తారు. అలాగే ఆ సంస్థ సభ్యుల ప్రయాణాలపైనా, ఆయుధాలపైనా నిషేధం అమలులో ఉంది.
చెక్ రిపబ్లిక్ నూతన అధ్యక్షుడిగా పావెల్:
చెక్ రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడిగా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ పెట్ర పావెల్ ఎన్నికయ్యారు. బిలియనీర్ అండ్రెజ్ బబీస్‌ను ఓడించి, ఆ పదవిని కైవసం చేసుకున్నారు. పావెల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో నాటో కూటమిలోని సైనిక కమిటీకి పావెల్ నేతృత్వం వహించారు.
జాతీయం:
మొగల్ గార్డెన్స్ ఇక .. అమృత్ ఉద్యాన్:
ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యాన వనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్‌లోని మొగల్ గార్డెన్స్ పేరు మారింది. ఇక నుంచి దీనిని అమృత్ ఉద్యాన్‌గా పిలవనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను దేశం నిర్వహించుకుంటున్న వేళ మొగల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నావికా గుప్తా తెలిపారు.
ప్రపంచంలో అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా ఎన్ఎస్ఈ:
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచంలోనే అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా నిలిచింది. 2022లో ట్రేడయిన మొత్తం డెరివేటివ్ కాంట్రాక్టుల సంఖ్య ఆధారంగా ఫ్యూచర్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎఫ్ఐఏ) ఈ ర్యాంకుల్ని ఇస్తుందని ఎన్ఎస్ఈ తెలిపింది.
ఈక్విటీ విభాగంలోనూ ట్రేడ్ల సంఖ్య (ఎలక్ట్రానిక్ ఆర్డర్ బుక్) ఆధారంగా 2022లో ఎన్ఎస్ఈకి మూడో స్థానం లభించింది. గత ఏడాది మూడో స్థానంలో ఉండగా ఒక స్థానం మెరుగుపడింది. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజీస్ (డబ్ల్యూఎఫ్ఈ) ఈ గణాంకాలను నిర్వహిస్తుంది.
గణతంత్ర దినోత్సవ విజేత ఉత్తరాఖండ్ శకటం:
గణతంత్ర దినోత్సవ సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన చూపించిన ఉత్తరాఖండ్ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది. కవాతు చేసిన శకటాల్లో వివిధ విభాగాల్లో తొలి మూడు స్థానాలకు ఎంపికైన వాటిని కేంద్రం ప్రకటించింది.
ప్రభుత్వ శాఖల్లో గిరిజన వ్యవహారాల శాఖ శకటం ఉత్తమ స్థానం సాధించింది. త్రివిధ దళాల సైనికులు చేసిన కవాతుల్లో పంజాబ్ రెజిమెంట్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే కేంద్ర సాయుధ పోలీసు దళాలకు సంబంధించి సీఆర్‌పీఎఫ్ మొదటి బహుమతి గెలుచుకుంది. మై గవ్ వెబ్‌సైట్‌లో నమోదైన ఓటింగ్‌లో గుజరాత్ శకటం, వాయుసేన కవాతు, హోంశాఖ శకటాలకు ఆయా విభాగాల్లో తొలి స్థానాలు దక్కాయి.
నిజాం వారసుడిగా అజ్మత్ జా:
హైదరాబాద్ నిజాం వారసుడిగా మీర్ మహ్మద్ అజ్మత్ అలీఖాన్ అజ్మత్ జా ఎంపికయ్యారు. ప్రిన్స్ ముకర్రమ్ జా మృతి అనంతరం ఆయన వారసుడిగా అజ్మత్ జాను ఎంపిక చేశామని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, నిజాం ట్రస్టీల మధ్య సంప్రదాయ పద్ధతిలో ఈ ప్రక్రియను నిర్వహించామని చౌమహల్లా ప్యాలెస్ నుంచి ప్రకటన వెలువడింది.