- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరెంట్ అఫైర్స్: అవార్డులు
తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం:
కోల్‌కతాలో జరిగిన బుద్దిస్ట్ టూర్ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీనిని స్వీకరించారు.
ఆరోగ్య ప్రమాణాల్లో అగ్రస్థానంలో ఆసిఫాబాద్ జిల్లా:
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య జీవన ప్రమాణాల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అగ్రస్థానం సాధించగా హైదరాబాద్ అట్టడుగున నిలిచింది.
పోషకాహార లోపం అధికంగా ఉన్న జిల్లాల్లో గద్వాల, ఆదిలాబాద్ ముందు వరుసలో ఉన్నాయి.
ప్రధాని ఆర్థిక సలహా మండలి తాజాగా సామాజిక పురోగతి సూచీ పేరిట విడుదల చేసిన తాజా నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది.
2020-2022 మధ్య ఆరోగ్యం, జీవన ప్రమాణాలు, పోషకాహారం తదితర కేటగిరిల్లో వివిధ అంశాలకు పాయింట్లు కేటాయించి, దాని ప్రకారం రాష్ట్రాలు, జిల్లాల స్థితిని వెల్లడించింది.
జాతీయ స్థాయిలో చూస్తే హెల్త్ అండ్ వెల్‌నెస్‌లో తెలంగాణ 26వ స్థానంలో ఉంది.
అవార్డులు:
కేసీఆర్‌కు సర్ చోటూ రామ్ పురస్కారం:
పంజాబ్‌కు చెందిన ప్రముఖ రైతు నాయకుడు సర్ చోటూ రామ్ జాతీయ పురస్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎంపిక చేసినట్లు అఖిల భారత రైతు సంఘం వెల్లడించింది. తెలంగాణ రైతుల శ్రేయస్సుకు సీఎం చేస్తున్న అవిరళ కృషికి గాను దీనిని ప్రకటిస్తున్నట్లు తెలిపింది.
రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారం ప్రదానం:
ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారాన్ని డైరెక్టర్ రాజమౌళి అందుకున్నారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా ఈ అవార్డు అందుకున్నారు.