- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరెంట్ అఫైర్స్: 21-12-2022
కాప్ - 15 సదస్సులో జీవవైవిధ్య ఒప్పందానికి ఆమోదం:
తీవ్రస్థాయి చర్చల తర్వాత చారిత్రాత్మక జీవ వైవిధ్య ఒప్పందానికి కాప్ - 15 సదస్సులో దాదాపు అన్ని దేశాలు ఆమోదం తెలిపాయి.
ఇప్పటికే వాటిల్లిన నష్టాన్ని భర్తీ చేసి, భూగోళాన్ని పరిరక్షించడం దీని ఉద్దేశం.
గత నాలుగేళ్లుగా దీనిపై తర్జనభర్జనలు కొనసాగుతూ వచ్చాయి.
భూతాపానికి అడ్డుకట్ట వేయాలన్న పారిస్ ఒప్పందం తరహాలోనే ఇది కూడా ఉంటుంది.
కాలుష్యం, వాతావరణ మార్పుల నుంచి భూమిని, మహాసముద్రాలు, జీవులను కాపాడటం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం.
1970 తో పోలిస్తే క్షీరదాలు, పక్షులు, ఉభయచర జీవులు, సరీసృపాలు, చేపల సంఖ్యలో 69 శాతం తగ్గుదల ఉందని నివేదికలు చెబుతున్నాయి.
వ్యవసాయ రాయితీలు, పురుగు మందుల నిధుల్ని సమీకరించాలనేది ఒప్పందంలో ఒక అంశం.
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్‌కు బ్లిట్జ్ టైటిల్:
తెలంగాణ యువ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ మరో అంతర్జాతీయ టైటిల్ గెలిచాడు.
సన్‌వే సిట్జెస్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్ షిప్‌లో అతను విజేతగా నిలిచాడు.
చెసబుల్ సన్ వే సిట్జెస్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో భాగంగా స్పెయిన్‌లో జరిగిన ఈ టోర్నీలో అతను 9 రౌండ్ల నుంచి 8.5 పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనా:
ఫైనల్లో ఫ్రాన్స్ ను ఓడించి.. అర్జెంటీనా ఫిఫా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది.
అర్జెంటీనా తరఫున మెస్సి రెండు గోల్స్ కొట్టగా, డిమారియా ఓ గోల్ సాధించాడు.
అర్జెంటీనా చివరిసారి చివరిసారి 1986లో మారడోనా నేతృత్వంలో ప్రపంచ కప్ సాధించింది.
మొత్తంగా ఆ జట్టు మూడోసారి జగజ్జేతగా నిలిచింది.
అంధుల టీ20 ప్రపంచకప్ భారత్ విజయం:
అంధుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది.
బంగ్లాదేశ్‌ను 120 పరుగుల తేడాతో చిత్తు చేసి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది.
ఫైనల్లో మొదట భారత్ 20 ఓవర్లలో 277 పరుగుల భారీ స్కోరు చేసింది.
సునీల్ రమేశ్, కెప్టెన్ అజయ్ కుమార్ రెడ్డి సెంచరీలు సాధించారు.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడకుండా టైటిల్ నిలబెట్టుకోవడం విశేషం.
2012, 2017 టోర్నీల్లోనూ మన జట్టు విజేతగా నిలిచింది.
తెలంగాణలో ఏటా పెరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలు:
నిరుద్యోగ కారణాలతో తెలంగాణలో ప్రతి ఏడాది ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక్‌సభలో తెలిపారు.
నిరుద్యోగుల ఆత్మహత్యలు:
2019 - 7,675
2020 - 8,058
2021 - 10,171
సంపద వృద్ధిలో గౌతమ్ అదానీకి తొలి స్థానం:
ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం సంపద వృద్ధిలో గౌతమ్ అదానీదే తొలి స్థానం అని బ్లూమ్ బర్గ్ 50 నివేదిక తెలిపింది.
ఈ ఏడాది ఆయన సంపద విలువ 49 బిలియన్ డాలర్ల మేర పెరిగింది.
125.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో అదానీ మూడో స్థానంలో కొనసాగుతున్నారని పేర్కొంది.
కొనుగోళ్ల ఒప్పందంలోనూ అదానీ ముందు వరుసలో నిలిచారు.
ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి లియో వరాద్కర్:
భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు.
ఫిన్‌గేల్ పార్టీకి చెందిన ఈయనకు రొటేషన్ పద్ధతిలో అవకాశం వచ్చింది.
2017 లో తొలిసారి ఐర్లాండ్ ప్రధానిగా 43 ఏళ్ల వరాద్కర్ ఎంపికయ్యారు.
ఆయన భాగస్వామి మాథ్యూ బారెట్ మెడికల్ ప్రాక్టీషనర్, వరాద్కర్ కూడా వైద్య వృత్తి చేపట్టారు.
ముంబయిలోని కేఈఎం ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు.
లియో తండ్రి మహారాష్ట్రకు చెందిన అశోక్, తల్లి మిరియం.. ఈమె ఐరిష్ వాసి.