లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 20-1-2023

by Harish |
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 20-1-2023
X

జనాభాలో భారత్ నెం-1:

జనాభాలో చైనాను అధిగమించి భారత్ తొలి స్థానానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

తాజాగా వరల్డ్ పాపులేషన్ రివ్యూ కూడా ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లు పేర్కొంది.

చైనాలో జననాల రేటు తగ్గినట్టు ఇటీవల పలు నివేదికలు వెల్లడించాయి.

వరల్డ్ పాపులేషన్ రివ్యూ అంచనాల ప్రకారం 2022 చివరి నాటికే భారత జనాభా 141.7 కోట్లు కాగా, ఇప్పుడు ఈ సంఖ్య 142.3 కోట్లకు చేరుకుందని అంచనా.

చైనా ఇటీవల ప్రకటించిన గణాంకాల కంటే భారత్ జనాభానే ఎక్కువ అనేది దీనిని బట్టి స్పష్టమవుతోంది.

2022 నవంబర్ 15న పుట్టిన శిశువుతో ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు ఉండగా 48 ఏళ్లలో రెట్టింపయింది.

భారత పార్లమెంట్ భవనానికి 96 ఏళ్లు:

ప్రపంచంలో అద్ఛుతమైన కట్టడాల్లో ఒకటిగా భారత పార్లమెంట్ పేరొందింది.

స్వతంత్ర భారతావని ఆవిర్భావం, నూతన రాజ్యాంగం, వినూత్న చట్టాలు, వాదప్రతివాదాలు, వివాదాస్పద శాసనాలు.. ఇలా ఎన్నిటికో వేదికైన పార్లమెంట్ కట్టడానికి 96 ఏళ్లు పూర్తయ్యాయి.

1927 జనవరి 18న అప్పటి వైశ్రాయ్ లార్డ్ ఇర్విన్ ఈ భవనాన్ని ప్రారంభించారు.

భారత్‌లో బ్రిటన్ సామ్రాజ్య రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి తరలించిన నేపథ్యంలో రైసినా హిల్ ప్రాంతంలో 1921 ఫిబ్రవరి 12న పార్లమెంటు భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.

బ్రిటన్ ఆర్కిటెక్ట్ లు సర్ హెర్బర్ట్ బాకర్, సర్ ఎడ్విన్ లుటియన్స్ లు దీని రూపశిల్పులు.

560 అడుగుల వ్యాసంతో, మైలులో మూడో వంతు చుట్టుకొలత కలిగిన వలయాకార సుందర భవనం నిర్మాణానికి 6 ఏళ్ల సమయం పట్టింది.

తెలంగాణ సీఎస్ గా శాంతికుమారి:

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారణి ఎ.శాంతికుమారి నియమితులయ్యారు. రాష్ట్రానికి ఆమె తొలి మహిళా సీఎస్ కావడం విశేషం.

1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి ప్రస్తుతం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

ఆమె పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేసిన వెంటనే ఉత్తర్వులు వెలువడ్డాయి.

శాంతికుమారి పదవీకాలం 2025 ఏప్రిల్ వరకు ఉంది.

దేశంలో అత్యుత్తమ ఇంక్యుబేటరుగా టీహబ్:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ టీహబ్ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే జాతీయ అంకుర సంస్థల పురస్కారం - 2022 పొందింది.

దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటరుగా ఎంపికైంది.

కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి సోం ప్రకాశ్ దీనిని ఆన్‌లైన్‌లో అందజేశారు.

Advertisement

Next Story

Most Viewed