కరెంట్ అఫైర్స్.. (గ్రూప్ -2,3,4.. ఎస్ఐ/కానిస్టేబుల్, జేఎల్)

by Harish |   ( Updated:2023-02-24 14:30:22.0  )
కరెంట్ అఫైర్స్.. (గ్రూప్ -2,3,4.. ఎస్ఐ/కానిస్టేబుల్, జేఎల్)
X

నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం:

నీతి ఆయోగ్ సీఈవోగా 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. రెండేళ్ల కాలానికి వరల్డ్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నియమితులైన పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన నిమితులయ్యారు. గతంలో సుబ్రహ్మణ్యం జమ్మూ కశ్మీర్ చీఫ్ సెక్రటరీగానూ, చత్తీస్‌‌‌‌గఢ్ కు అండిషనల్ చీఫ్ సెక్రటరీగానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2004-08 మధ్యలో పీఎం మన్మోహన్ సింగ్‌కు ప్రైవేట్ సెక్రటరీగా కూడా పనిచేశారు.

ప్రేమ్ కుమార్ మాలిక్‌కు సంగీత నాటక అకాడమీ అవార్డు:

క్లాసికల్ సింగర్ అయిన పీటి ప్రేమ్ కుమార్ మాలిక్ 2019 ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సంగీత రంగంలో (హిందుస్థానీ స్వరం) కృషి చేసినందుకు గాను ఆయనకు ఈ అవార్డు లభించింది. అలహాబాద్ యూనివర్సిటీలో సంగీతం, ప్రదర్శన కళల విభాగంలో ఆయన ప్రొఫెసర్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డును ప్రేమ్ కుమార్‌కు ప్రధానం చేశారు.

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పుస్తకావిష్కరణ:

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రొఫెసర్ ధర్మలింగం రచించిన పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ: ఆలోచనలను వ్యాప్తి చేయడం, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ: సమగ్ర మానవతా వాదం.. అనే రెండు పుస్తకాలను చెన్నైలో ఆవిష్కరించారు.

18వ UIC వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్:

18వ యూఐసి వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్‌ను ఫిబ్రవరి 21, 2023న జైపూర్‌లో నిర్వహించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ రైల్వేస్, పారిస్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించాయి. దీని 2023 థీమ్ ‘రైల్వే భద్రతా వ్యూహం: ప్రతిస్పందన .. విజన్ ఫర్ ఫ్యూచర్’.ఈ వరల్డ్ సెక్యూరిటీ కాంగ్రెస్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన భద్రతా పరమైన వేదిక యూఐసిగా పిలవబడే ఈ అంతర్జాతీయ రైల్వే యూనియన్‌ 1922లో ఏర్పాటయింది.

నేషనల్ జాగ్రఫిక్ పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్‌కు ఎంపికైన కార్తిక్ సుబ్రమణియం:

భారత సంతతికి చెందిన కార్తీక్ సుబ్రమణియం ప్రతిష్టాత్మక నేషనల్ జాగ్రఫిక్ పిక్చర్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన తీసిన డ్యాన్స్ ఆఫ్ ది ఈగల్స్ అనే ఫోటోగ్రాఫ్ కి ఈ అవార్డు లభించింది.

భారత్ వృద్ధి రేటు 5.9 శాతం: ఇండియా రేటింగ్స్ & రీసెర్చ్

ప్రముఖ క్రెడిట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ..భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును 2023- 24 ఆర్థిక సంవత్సరానికి 5.9 శాతంగా అంచనా వేసింది. ఇది ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బిఐ అంచనా వేసిన 6.4 శాతం వృద్ధి కంటే తక్కువగా ఉంది. ఆర్థిక పునరుద్దరణలో ప్రైవేటు తుది వినియోగ వ్యయం, ప్రభుత్వ తుది వినియోగ వ్యయంతో పాటు నికర ఎగుమతులలో లోపాలు ఉండటమే వృద్ధిరేటు క్షీణించడానికి కారణాలని ఏజెన్సీ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

ఇండియన్ ఆర్మీలో జేసీవో, హవల్దార్ పోస్టులు

Advertisement

Next Story

Most Viewed