- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లేటెస్ట్ కరెంట్ అఫైర్స్: 29-12-2022
2022-23 లో భారత వృద్ధి 6.8 శాతం: ఐఎంఎఫ్
వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో భారత వృద్ధి రేటు వరుసగా 6.8 శాతం, 6.1 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేసింది.
ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని పేర్కొంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ మెరుగైన వృద్ధిని కొనసాగిస్తుందని వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో పేర్కొన్నారు.
గత అంచనాలతో పోలిస్తే తాజా అంచనాలు చాలా ఎక్కువేనని ఐఎంఎఫ్ ఇండియా మిషన్ చీఫ్ చౌయిరీ నాడా అన్నారు.
వివరాలు:
2022 -23 లో వృద్ధి రేటు 6.8 శాతం
2923-24 లో వృద్ధి రేటు 6.1 శాతం
ఫిజీ నూతన ప్రధానిగా రబూకా:
ఫిజీ నూతన ప్రధానమంత్రిగా సితవేని రబూకా బాధ్యతలు స్వీకరించారు.
74 ఏళ్ల ఈ మాజీ సైనిక కమాండర్ పార్లమెంటు సభ్యుల మధ్య జరిగిన రహస్య ఓటింగ్ లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గి గత 16 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఫ్రాంక్ బైనిమారామాను అధికారానికి దూరం చేశారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో రబూకాకు చెందిన పీపుల్స్ అలయన్స్ కూటమికి 29, బైనిమారామా కూటమికి 26 స్థానాలు లభించాయి.
నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణం:
సీపీఎన్ - మావోయిస్టు సెంటర్ (ఎంసీ) పార్టీ ఛైర్మన్ పుష్ప కమల్ దహాల్ ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు.
గెరిల్లా ఉద్యమ నేతగా పేరొందిన ఆయనతో దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రమాణం చేయించారు.
ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్నర్ అశ్విన్ నాలుగో ర్యాంకుకు చేరుకున్నాడు.