- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాస్ లీవ్ పెట్టిన కరెంట్ ఉద్యోగులు.. సీఎండీ స్పందన ఏంటి..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ కరెంట్ ఉద్యోగులు జిల్లా సర్కిల్ సూపరింటెండెంట్ మధ్య జరుగుతున్న వివాదం ముదిరి పాకాన పడింది. గురువారం నుంచి నిజామాబాద్ సర్కిల్లోని స్వీపర్ మొదలుకుని డీఈల వరకు మాస్ లీవ్ పెట్టారు. ఈ మేరకు టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీఎండీకి లేఖను పంపినట్లు జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ తెలిపారు. కరెంట్ ఉద్యోగులను ఎస్ఈ వేధిస్తున్నాడని గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినా ఎస్ఈని బదిలీ చేయకపోవడంతో జేఏసీ ఆందోళన ఉధృతం చేసింది.
ఇందులో భాగంగా ఉద్యోగులు, ఐకాస నేతలు విడుదల చేసిన వీడియో, సోషల్ మీడియా మెసేజ్‌లు తనను బాధించాయని ఎస్ఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో 5వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరి జేఏసీ నేతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. మంగళవారం సమావేశమైన విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఎస్ఈని బదిలీ చేసే వరకు విధులకు రామని నిర్ణయించారు. ఇందుకోసం గురువారం నుంచి సామూహిక సెలవులు పెట్టారు. ఈ మేరకు కంపెనీ సీఎండీకి లేఖ రాశారు. బుధవారం వరకు సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కరోనా కాలంలో కరెంట్ ఉద్యోగులు సామూహిక సెలవు ఎక్కడికి వెళ్తుందో వేచి చూడాల్సిందే.
file:///C:/Users/pmpl/Downloads/New Doc 2021-09-21 19.43.01 (1).pdf