సీఎస్కే ట్రైనింగ్ షురూ.. ఎప్పటి నుంచంటే

by Sumithra |
సీఎస్కే ట్రైనింగ్ షురూ.. ఎప్పటి నుంచంటే
X

దిశ, స్పోర్ట్స్: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ట్రైనింగ్ క్యాంప్ మార్చి 11 నుంచి చేపాక్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ క్యాంపు మొదటి రోజు నుంచే కెప్టెన్ ఎంఎస్ ధోనీతో పాటు అందుబాటులో ఉండే ఇతర క్రికెటర్లు కూడా పాల్గొంటారని తెలుస్తున్నది. ఒకవైపు ఐపీఎల్ వేదికలపై స్పష్టత రాక బీసీసీఐ పూర్తి స్థాయి షెడ్యూల్ ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతున్నది. కానీ, బీసీసీఐ నిర్ణయంతో పని లేకుండా సీఎస్కే మాత్రం పూర్తి స్థాయి క్యాంప్ నిర్వహణకు సిద్దమవుతున్నది.

పూర్తి బయోబబుల్ వాతావరణంలో.. కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ ఈ క్యాంప్ నిర్వహించనున్నట్లు సీఎస్కే వర్గాలు చెబుతున్నాయి. గత సీజన్ సమయంలో కూడా సీఎస్కే చెన్నైలో క్యాంపు నిర్వహించింది. ఆ తర్వాత జట్టు మొత్తం ఒకే సారి యూఏఈ చేరుకున్నారు. అక్కడే ముగ్గురు క్రికెటర్లకు కోవిడ్ పాజిటీవ్ వచ్చింది. కోవిడ్ నుంచి కోలుకున్న రుతురాజ్ గైక్వాడ్ లీగ్ చివరి దశలో చక్కగా రాణించాడు. అయితే గత ఏడాది కోవిడ్ భయాందోళనల మధ్య జట్టుకు దూరమైన సురేష్ రైనా.. క్యాంప్‌లో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాడనేదానిపై సమాచారం లేదు.

Advertisement

Next Story

Most Viewed