- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బయోబబుల్‌లోకి భారత జట్టు.. బస చేసే హోటల్ అదేనంటా..!
దిశ, స్పోర్ట్స్: భారత జట్టు ఈ నెల 16న దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరనున్నది. అక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్‌లో ఆడాల్సి ఉన్నది. అయితే దక్షిణాఫ్రికాలో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నది. దీంతో అసలు సిరీస్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు వచ్చాయి. టీమ్ ఇండియా పర్యటన కనుక రద్దయితే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అంతే కాకుండా వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టు పాయింట్లు కోల్పోవలసి వస్తుంది. అందుకే ఇరు దేశాల క్రికెట్ బోర్డులు టీ20 సిరీస్‌ను తప్పించి పర్యటనను ఖరారు చేశాయి. టీమ్ఇండియా మరో నాలుగురోజుల్లో ముంబై నుంచి జొహెన్నెస్‌బర్గ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లనున్నది.
ఇప్పటికే సీఎస్ఏ ప్రిటోరియాలోని ఐరీన్ కంట్రీ లాడ్జ్‌ను టీమ్ ఇండియా కోసం బుక్ చేసింది. ఇప్పటికే అత్యంత ఆధునిక సౌకర్యాలు ఉన్న ఈ హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకొని బయోబబుల్ వాతావరణాన్ని ఏర్పాటు చేసింది. డిసెంబర్ 17న భారత జట్టు ఈ హోటల్‌కు రానున్నది. మొదటి రెండు టెస్టు వేదికలకు ఈ హోటల్ నుంచే టీమ్ ఇండియా ప్రయాణిస్తుంది. ఆ తర్వాత చివరి టెస్టు కోసం కేప్ టౌన్‌ను ప్రయాణం అవుతుంది. ఇప్పటికే బయటి నుంచి హోటల్‌కు ఎవరినీ అనుమతించడం లేదు. హోటల్ సిబ్బందిని ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచారు. వారికి క్రమం తప్పకుండా కోవిడ్ టెస్టులు చేస్తున్నారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి చెందిన వైద్య అధికారులు ఇక్కడ పర్యవేక్షకులుగా ఉన్నారు.