నవీపేట్‌లో విషాదం.. సీఆర్పీఎఫ్ జవాన్ మృతి

by Sumithra |
CRPF jawan
X

దిశ, నవీపేట్: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ కాలనీకి చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ డాంగే గోవర్ధన్ (28) శనివారం రాత్రి మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, గోవర్ధన్ మృతికి గల కారణాలు ఇంకా అధికారికంగా తెలియరాలేదు. గోవర్ధన్ మృతితో కాలనీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్య అనిత, ఏడాదిన్నర కుమారుడు ధనుష్ ఉన్నారు. గోవర్ధన్ ప్రస్తుతం ఒడిశాలో విధులు నిర్వహిస్తున్నారని, ఇటీవల అతను ఇంటికి వచ్చి వెళ్లారని స్థానికులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed