- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాస్వామ్యం మరింత పటిష్టం : మోదీ
దిశ, వెబ్‌డెస్క్: విమర్శలు ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తాయని ప్రధాని మోదీ అన్నారు. కొత్త తరం యుతవ పుస్తకాలు చదివే అలవాటును పెంపొందించుకోవాలని ప్రధాని మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ-టెక్స్ట్, ట్వీట్‌లు, గూగుల్ గురు లాంటివి అత్యంత ఎక్కువగా ఆదరణ దక్కించుకుంటున్న ఈ తరుణంలో యువత విజ్ఞాన సమూపార్జనకు దూరం కాకూడదని తెలిపారు. జైపూర్‌లో పత్రికా గ్రూప్ ఛైర్మన్ గులాబీ కొఠారి రచించిన పుస్తకాలను ప్రధాని మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, దేశీయ ఉత్పత్తులతో పాటు మన దేశ స్వరం ప్రపంచవ్యాప్తమవుతోందని, అంతర్జాతీయ కంపెనీల్లో మన దేశం ఉనికిని ఘనంగా చాటుకుంటున్నట్టు మోదీ పేర్కొన్నారు. అనేక దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయని, భారత్‌లో జరుగుతున్న అంశాల గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నాయని, ఈ పరిస్థితుల్లో మన దేశీయ మీడియా గ్లోబల్‌గా ఎదగాల్సిన అవసరముందని ప్రధాని మోదీ చెప్పారు. కొవిడ్-19 వైరస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు మీడియా అసాధారణ స్థాయిలో సేవలందించినట్టు మోదీ అభినందించారు. మీడియా సైతం కొన్ని సమయాల్లో విమర్శలను ఎదుర్కొంటున్నప్పటికీ.. సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరూ విమర్శల నుంచి నేర్చుకోవాల్సిన అవసరముందని, ఇది భారత ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తుందన్నారు.