- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రస్థానం’ రచయితకు అరుదైన గౌరవం.. ఆ మెంబర్‌గా ఏకగ్రీవం!
దిశ, కరీంనగర్ సిటీ : ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ ఇండియా సౌత్ రీజియన్ సభ్యుడిగా ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ పొన్నం రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయినట్టు ఆ సంస్థ కార్యదర్శి బీఎస్ఎస్ ప్రకాష్ రెడ్డి తెలిపారు. దక్షిణాది నుంచి ప్రాంతీయ సభ్యుని కోసం ఒక్క నామినేషన్ మాత్రమే రాగా, ఏకగ్రీవంగా ప్రకటించి, నియామకపత్రం అందజేసినట్లు వెల్లడించారు. రవిచంద్ర గత కొన్నేళ్లుగా ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ, అనేక సినీ వ్యాసాలు రాస్తున్నారు.
ప్రస్తుతం కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ఆయన రాసిన ‘ప్రస్థానం’ ఉత్తమ సినిమా ‘గ్రంధంగా’ ఎంపికై, నంది అవార్డు సొంతం చేసుకుంది. బాలీవుడ్ నటుడు పైడి జైరాజ్ పై రవిచంద్ర రూపొందించిన డాక్యుమెంటరీ, పలు ఇంటర్నేషనల్ వేదికలపై ప్రదర్శించబడి 6 అవార్డులను అందుకుంది. ఇటీవలే వచ్చిన ‘సర్దార్ సర్వాయి పాపన్న’ డాక్యుమెంటరీ పలువురి ప్రశంశలు పొందింది. రవిచంద్ర ఎంపిక పట్ల కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ సభ్యులతో పాటు, ఫిల్మ్ క్రిటిక్ హెచ్. రమేష్ బాబు, పివి. రామ్మోహన రాయుడు, పీఎస్ రవీంద్ర, అక్షరయాన్ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీలక్ష్మి, అన్నవరం దేవేందర్, కెఎస్ అనంతాచార్య తదితరులు హర్షం వ్యక్తం చేశారు.