- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
2025 నాటికి రూ. 50 లక్షల కోట్లకు మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ!
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే కొన్నేళ్లలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రెండంకెల వృద్ధిని సాధిస్తుందని, 2025 నాటికి పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ. 50 లక్షల కోట్లను దాటనున్నట్టు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. ఈక్విటీల్లో పెట్టుబడులు అధికంగా ఉన్న కారణంగా మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ వృద్ధి వేగంగా ఉందని క్రిసిల్ పరిశోధనా విభాగం అభిప్రాయపడింది. స్టాక్ మార్కెట్ల అస్థిరత కారణంగా ఇటీవల మ్యూచువల్ ఫండ్ విభాగంలో పెట్టుబడిదారుల ఆసక్తి మారుతోందని, 2020 నాటికి పరిశ్రమ నిర్వహణ ఆస్తులు సుమారు రూ. 30 లక్షల కోట్లుగా ఉందని క్రిసిల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆశు సుయాష్ చెప్పారు. 2025 నాటికి పరిశ్రమ రెండంకెల వృద్ధితో రూ. 50 లక్షల కోట్లను దాటగలదని నమ్ముతున్నట్టు ఆమె పేర్కొన్నారు. 2003 సమయంలో పరిశ్రమ నిర్వహణ ఆస్తుల విలువ రూ. 1.4 లక్షల కోట్లుగా ఉన్నాయని, గడిచిన 20 ఏళ్ల కాలంలో పరిశ్రమ ఏడాదికి 18.5 శాతం వృద్ధి రేటుతో వృద్ధి సాధించినట్టు ఆశు సుయాష్ వెల్లడించారు.