'పండుగ సీజన్‌లో ఆటో పరిశ్రమకు డిమాండ్'!

by Harish |
పండుగ సీజన్‌లో ఆటో పరిశ్రమకు డిమాండ్!
X

దిశ, సెంట్రల్ డెస్క్: ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల అమ్మకాలు పదేళ్ల స్థాయికి దిగిరావడంతో మొత్తం వాహనాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టానికి పడిపోతుందని క్రిసెల్ సంస్థ అభిప్రాయపడింది. దేశంలో లాక్‌డౌన్ పొడిగింపు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాల క్షీణత రెండంకెల దిగువకు చేరుతుందని శుక్రవారం నివేదికలో వెల్లడించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి 26 నుంచి 28 శాతం, ప్యాసింజర్ వాహనాలు అమ్మకాలు 24 నుంచి 26 శాతం తగ్గిపోవచ్చని క్రిసిల్ పేర్కొంది. వీటిలో ట్రాక్టర్ల విక్రయాలు మాత్రం కొంత మెరుగ్గా 7 నుంచి 9 శాతం మాత్రమే క్షీణించే అవకాశముందని అభిప్రాయపడింది. కరోనా సంబంధిత సమస్యల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఆదాయం భారీగా పడిపోయిందని, మొత్తం 26 వేల కంపెనీలకు గాను రూ. 7 లక్షల కోట్ల ఉద్యోగ వ్యయాల ఉన్నట్లుగా నిర్ధారించినట్టు క్రిసిల్ రీసెర్చ్ ప్రతినిధి హతల్ గాంధీ తెలిపారు. ఈ పరిణామాలతో ఆటో రంగంలో ఉద్యోగ నష్టాలు, వేతన కోతలు పెరిగే అవకాశమున్నట్టు ఆయన వివరించారు. ఇక, రానున్న రోజుల్లో సరఫరా వ్యవస్థలో ఇబ్బందుల నుంచి వీలైనంత తొందరగా బయటపడి డిమాండ్ పుంజుకోవచ్చన్ని భావిస్తున్నట్టు క్రిసిల్ నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో పండుగ సీజన్ ఉండనున్న నేపథ్యంలో డిమాండ్ రికవరీ అవుతుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరుగుతాయని క్రిసిల్ పేర్కొంది. రబీ ఉత్పత్తులు పెరుగుతాయని, సాధారణ స్థాయిలో వర్షపాతం అంచనాలతో ట్రాక్టర్లక్ రెండో త్రైమాసికం నుంచే డిమాండ్ పెరుగుతందని క్రిసిల్ అభిప్రాయపడింది. ఇక, మిగిలిన ప్యాసింజర్, కమర్షియల్ వాహనాల అమ్మకాలకు మాత్రం నాలుగవ త్రైమాసికం వరకు పెరిగే అవకాశముందని తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed