పండుగకు ముందు రోజు రాత్రి మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడి

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-09-07 11:08:59.0  )
పండుగకు ముందు రోజు రాత్రి మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితికి ఒకరోజు ముందు ఓ మహిళపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌లో నిరీక్షిస్తున్న మహిళకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఇద్దరు కలిసి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తమిళనాడులో ఇవాళ ఉదయం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

తంజావూర్ జిల్లా పూతలూర్‌కు చెందిన మహిళ (42) ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తుంది. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి పని ముగించుకోని స్థానికంగా ఉన్న బస్టాప్‌కు వచ్చి బస్ కోసం ఎదురు చూస్తుంది. ఇదే సమయంలో అటుగా వచ్చిన రాయందూర్‌కు చెందిన ప్రవీణ్ (32), రాజ్ కుమార్ (26) ఒంటరిగా ఉన్న మహిళను చూశారు. చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో బస్ వెళ్లిపోయిందని.. మేము కూడా అటే వెళ్తున్నామని.. వస్తే డ్రాప్ చేసి వెళ్తామని నమ్మబలికారు. వారి మాటలు నమ్మిన వివాహిత ప్రవీన్ బైక్ ఎక్కింది. వారి వెనకాలే రాజ్ కుమార్ ఫాలో అయ్యాడు. నిర్మానుష్య ప్రాంతం రాగానే బైక్‌ను ఆపి ఆమె నోరు మూసి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఇద్దరు యువకులు మహిళను బెదిరిస్తూ దారుణంగా అత్యాచారం చేసి వదిలేసి పారిపోయారు. ఆ షాక్ నుంచి తేరుకున్న మహిళ శనివారం ఉదయం పూతలూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై జరిగిన దారుణాన్ని వివరిస్తూ భోరున విలపించింది. వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కామాంధుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Next Story