- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్థరాత్రి సీసీ కెమెరాకు అడ్డంగా బుక్కైన యువకులు.. నలుగురు కలిసి ఫార్చునర్ కారులో..
దిశ, వెబ్‌డెస్క్: సీసీ కెమెరాలు ఉన్నాయన్న భయం లేదు.. తప్పు చేస్తున్నామన్న అపరాదభావం అంతకన్న లేదు.. ఏదో తమ ఇంట్లోనే వచ్చిపోయాం అన్నట్టు పరాయి ఇళ్లలో దూరి యథేచ్ఛగా దొంగతనాలు (thefts)చేస్తున్నారు దుండగులు. కేవలం ఇళ్లే కాదు.. దుకాణాలు, షాపింగ్ మాల్స్, జ్యువెలరీ షాపుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. అందినకాడికి దోచుకోని వెళ్తున్నారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అవుతున్నా.. పట్టించుకోకుండా రాబరీ మీదనే ఫోకస్ పెడుతున్నారు. తాజాగా గుంటూరు (Guntur) జిల్లాలోని ఓ జ్యువెలరీ షాపులో దొంగలు భారీగా నగలను దోచుకెళ్లారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. బుధవారం అర్థరాత్రి ఫార్చునర్ కారు (Fortuner car)లో వచ్చిన నలుగురు యువకులు పొన్నూరు (Ponnur) పట్టణంలోకి ఎంట్రీ అయ్యారు. వారిలో ఒకరు కారులో ఉండగా.. మరో ముగ్గురు తోటమ్మ తల్లి గుడి (Thotamma thalli temple) దగ్గర ఉన్న లక్ష్మీ ప్రసన్న బంగారం, వెండి ఆభరణాల షాపు షెట్టర్‌ను ఇనుప రాడ్డు సాయంతో లేపారు. ముందుగా ఒకరు షాపులోకి వెళ్లి కౌంటర్ దగ్గర ఉన్న ఆభరణాలు చోరీ చేయగా.. అతడి వెనకాలే వచ్చిన మరో దుండగుడు జ్యువెలరీ (Jewelry) లో ఉన్న అన్ని బంగారం (Gold), వెండి (Silver) వస్తువులను బ్యాగ్‌లో సర్ధుకున్నాడు. ఇదే సమయంలో మరో దుండగుడు వచ్చి మిగతా ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. ఈ విజువల్స్ మొత్తం షాపులో ఉన్న సీసీ కెమెరా (CC camera)లో రికార్డు అయ్యాయి. కాగా, దొంగలు ఎత్తుకెళ్లిన ఆభరణాల విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని షాపు యజమాని పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పొన్నూరు పట్టణ పోలీసులు (Ponnur Town Police) క్రైం సీన్‌ను పరిశీలించారు. సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోల ఆధారంగా దొంగలు రాజస్థాన్(Rajasthan)కు ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, నలుగురు దుండగుల్లో ఒకరిని స్థానికులు పట్టుకోని పోలీసులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.