- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెరువులో పల్టీ కొట్టిన ఎన్నికల అబ్జర్వర్ టీం వాహనం.!

X
దిశ, నాగర్ కర్నూల్ క్రైం : గత నెల రోజులుగా ఎన్నికల పరిశీలకుల టీం చెందిన తుఫాన్ వాహనం ప్రమాదవశాత్తు చెరువులోకి ఫల్టీ కొట్టింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మినీ ట్యాంక్ బండ్ కట్ట పై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన మధు అనే డ్రైవర్ తుఫాన్ వాహనంలో నాగర్ కర్నూల్ వెళ్తుండగా ఎండబెట్ల వద్ద ఉన్న బ్రిడ్జ్ పై నుండి అదుపుతప్పి చెరువులోకి ఫల్టీ కొట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు మునుగుతున్నాయని అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్ల తరచూ ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోయారు. డ్రైవర్ మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డాడు. దీని పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story