- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దంపతులిద్దరిని కారుతో ఢీకొట్టిన స్టార్ నటుడు.. భార్య మృతి..!
దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులో ఫుట్ పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న దంపతులిద్దరిని కన్నడ నటుడు నాగభూషణ తన కారుతో ఢీకొట్టాడు. వివరాల్లోకెళ్తే.. నాగభూషణ శనివారం రాత్రి సమయంలో తన కారులో ఉత్తరహళ్లి నుంచి కోననకుంట వైపు సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. రాత్రి 9. 45 గంటలకు వసంతపుర ప్రధాన రోడ్డు గుండా వెళ్తున్న క్రమంలో ఫుట్ పాత్‌పై అదే సమయంలో నడుచుకుంటూ వెళ్తున్న.. 58 ఏళ్ల కృష్ణ, 48 ఏళ్ల ప్రేమ.. దంపతులిద్దరిని ఢీకొట్టాడు. ఈ ఘటనలో వారిద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే నటుడు తేరుకొని క్షతగాత్రలును ఆసుపత్రికి తరలించాడు. పరిస్థితి విషమించడంతో ప్రేమ మధ్యలోనే మరణించింది. భర్త కృష్ణకు రెండు కాళ్లు, తల, కడుపుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంపై బెంగళూరులోని కుమారస్వామి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నాగభూషణపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద నటుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.