- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలానగర్ లో సంచలనం ఘటన…వ్యక్తి గొంతు కోసి దారుణ హత్య
దిశ, జడ్చర్ల : ఓ వ్యక్తి గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన బాలానగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి అతి సమీపంలోని వెంచర్ లో చోటుచేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… బాలనగర్ మండల కేంద్రంలోని అతి సమీపంలో ఉన్న పెద్దపల్లి గేటు వద్ద చాయ్ దునియా అనే టీ స్టాల్ నడిపే పర్వతాలు (35) వ్యక్తిని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా గొంతు కోసి దారుణ హత్య చేశారు. కాగా హత్యకు గురైన పర్వతాలు ఎవరికైనా అన్యాయం జరిగితే సహించే వాడు కాదని, అన్యాయం చేసిన వ్యక్తులను ఎదిరించేవాడని తెలిపారు.
కాగా పర్వతాలు హత్యకు పాత కక్షలే కారణం అని పలువురు అనుమానిస్తుండగా, అక్రమ సంబంధం నేపథ్యంలోనే పర్వతాలును అతి కిరాతకంగా హత్య చేసి ఉంటారని మండలంలో పలువురు చర్చించుకుంటున్నారు. కాగా ఈ ఘటన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ జానకి బాలానగర్ మండల కేంద్రంలోని పెద్దపల్లి వద్దకు చేరుకొని హత్య జరిగిన తీరును, ఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి హత్య కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.