డబ్బుల విషయంలో కత్తితో దాడి..

by Sridhar Babu |   ( Updated:2024-07-30 14:51:52.0  )
డబ్బుల విషయంలో కత్తితో దాడి..
X

దిశ, ఎల్బీనగర్ : డబ్బుల విషయంలో ఇరువురు వ్యక్తులు ఘర్షణకు దిగడంతో పక్కనే ఉన్న కొబ్బరిబొండాలు కొట్టే కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలైన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హస్తినాపురంనకు చెందిన ముసలారెడ్డి సాహెబ్ నగర్ గౌతమి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెంకట్ రెడ్డి కొబ్బరి బొండాల వ్యాపారి.

ఈ క్రమంలో ముసలా రెడ్డి వెంకట్ రెడ్డికి రూ.66,500 అప్పు ఇచ్చాడు. ఈ విషయంలో డబ్బులు ఇవ్వమని ముసలారెడ్డి వెంకటరెడ్డిని అడగడంతో ఇరువురు ఘర్షణకు దిగారు. దీంతో వెంకట్ రెడ్డి సమీపంలో ఉన్న కొబ్బరిబోండాలు కొట్టే కత్తితో ముసలారెడ్డి పై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాధితుడు ముసలారెడ్డి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి డబ్బులు ఇవ్వమని పోతే కత్తితో దాడి చేశాడని ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story