- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అగ్నిప్రమాద ఘటనపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: నాంపల్లి బజార్ ఘాట్‌లో అగ్నిప్రమాదం ఘటం చాలా దురదృష్టకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జంట నగరాల్లో వరుసగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. జనాలు నివసించే చోట్ల వ్యాపార సముదాయాలు నిర్వహించకూడదని తాను గతంలో అనేక సందర్భాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. అగ్నిప్రమాదం సంభవించిన భవనాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల విషయంలో ఈ ప్రభుత్వం తీరు దున్నపోతుమీద వర్షం పడినట్లుగానే ఉందని మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సాహయం అందేలా ప్రధానితో మాట్లాడుతానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు నివాసం ఉంటున్న చోట్ల అగ్నిప్రమాదాలకు కారణం అయ్యే వ్యాపార సముదాయాలను ఇకనైనా నగరం బయటకు తరలించేలా ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.