ఇంటర్నేషనల్ కొరియర్ అంటూ రూ.5 లక్షలకు టోపీ

by Sridhar Babu |   ( Updated:2024-07-24 10:52:43.0  )
ఇంటర్నేషనల్ కొరియర్ అంటూ రూ.5 లక్షలకు టోపీ
X

దిశ, తూప్రాన్ : సైబర్ క్రైమ్ పేరుతో యువతికి ఫోన్ చేసి 5 లక్షలు కాజేసిన ఘటన తూప్రాన్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువతికి గుర్తు తెలియని నంబర్ నుండి ఫోన్ చేసి మీ పేరు మీద ఇంటర్నేషనల్ కొరియర్ వచ్చింది అని చెప్పగా తాము ఎటువంటి ఆర్థర్ ఇవ్వలేదు మాకు సంబంధం లేదు అని యువతి తెలుపగా ఇది ఏదో మోసం లాగా ఉంది మీరు వెంటనే మా ద్వారా సైబర్ క్రైమ్ ను సంప్రదించడానికి మీ ఫోన్ లో 1 నొక్కండి అని చెప్పారు. అది నమ్మిన యువతి 1 నొక్కగానే వచ్చిన ఫోన్ కట్ అయ్యి స్కై ఏపీకే అనే యాప్ ఆమె మొబైల్ లో డౌన్లోడ్ అయ్యి స్కైప్ ద్వారా ఆమెకు వీడియో కాల్ రావడంతో వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యి మీ ఖాతాలోకి 6 లక్షల రూపాయలు వచ్చాయని తెలిపారు.

చెక్ చేసుకోవడానికి ఆమె బ్యాంక్ ఐసీఐసీఐ ఫోన్ బ్యాంక్ ద్వారా ఓపెన్ చేయగమే ఆమె ఫోన్ పనిచేయడం ఆగిపోతుంది.వెంటనే ఆమె తన భర్తకు సమాచారం ఇవ్వగా బ్యాంక్ కు వెళ్లి చూడగా ఆమె ఖాతా నుండి అప్పటికే 6 లక్షల రూపాయలు లోన్​ తీసి లక్ష, లక్ష ఇలా ఐదు లక్షల రూపాయలు కట్ అయ్యాయని బ్యాంక్ అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన యువతి 1930కి ఫోన్ చేసి తెలుపగా లక్ష 20 వేల రూపాయల ఫీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివానంధం తెలిపారు. ఈ విషయంపై ఐఎస్ఐ మాట్లాడుతూ సైబర్ క్రైమ్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మోసపోయిన యువతి వెంటనే 1930 కి కాల్ చేయడంతో లక్ష ఇరవై వేలు మిగిలాయని తెలిపారు.

Advertisement

Next Story