Income tax rides : రూ.60 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం

by Shiva |   ( Updated:2023-10-19 06:17:55.0  )
Income tax rides : రూ.60 కోట్ల విలువైన నగదు, బంగారం స్వాధీనం
X

దిశ, వెబ్ డెస్క్ : ఆదాయపు పన్ను శాఖ అక్టోబరు 5 నుంచి డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌కు సంబంధించిన ఆస్తులపై సోదాలు నిర్వహిస్తోంది. అంతేకాకుండా, సవిత విద్యా సంస్థలకు సంబంధించిన స్థలాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.32 కోట్ల విలువైన లెక్కలో చూపని నగదు, రూ.28 కోట్ల విలువైన బంగారం రికవరీ చేసినట్లుగా ఐటీ అధికారులు వెల్లడించారు. దీంతో మొత్తం రికవరీ చేసిన సొమ్ము రూ.60 కోట్లకు చేరింది. ఐటీ బృందాలు డిస్టిలరీ, ఫార్మాస్యూటికల్స్, ఆసుపత్రులు, హోటళ్లు, ఇతర వ్యాపారాపై కూడా నిఘా పెట్టాయి. అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరిలో సోదాల సమయంలో దాదాపు 100 ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాల హార్డ్ కాపీలు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకున్నారు. ఫీజు రశీదులు, స్కాలర్‌షిప్‌ల పంపిణీకి సంబంధించిన బోగస్ పత్రాలు ఐటీ శాఖ క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ప్రాథమిక విచారణలో భాగంగా లెక్కలు చూపని ఫీజుల రసీదుల విలువ రూ.400 కోట్లు ఉంటుందని అంచనా.

Advertisement

Next Story