క్రిస్టియన్ కన్వెన్షన్‌లో భారీ పేలుడు.. 23 మందికి సీరియస్

by GSrikanth |   ( Updated:2023-10-29 05:32:54.0  )
క్రిస్టియన్ కన్వెన్షన్‌లో భారీ పేలుడు.. 23 మందికి సీరియస్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలోని ఎర్నాకుళం క్రిస్టియన్ కన్వెన్షన్‌ సెంటర్ భారీ అగ్ని బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ బ్లాస్టింగ్‌లో ఒకరు అక్కడిక్కడే దుర్మరణం చెందగా.. 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. భయాందోళనకు గురైన స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించిన సమయంలో కన్వెన్షన్‌లో దాదాపు 2 వేల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాంబ్ బ్లాస్లింగ్‌‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed