Haiti : శరణార్థుల పడవలో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-20 02:40:29.0  )
Haiti : శరణార్థుల పడవలో ఘోర అగ్ని ప్రమాదం.. 40 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైతీ నుంచి 80 మంది శరణార్థులతో వెళ్తున్న బోటులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది దుర్మరణం చెందారు. మరో 41 మందిని హైతీ తీర రక్షణ దళం కాపాడింది. 11 మందికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల క్రితం హైతీ నుంచి బోటు బయల్దేరింది. కాయ్ కోస్, టర్క్స్‌కు పడవ వెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఐఓఎం చీఫ్ గ్రీగోర్ గుడ్‌స్టీన్ మాట్లాడుతూ.. హైతీలో సామాజిక ఆర్థిక పరిస్థితులు సంక్షోభంలో ఉన్నాయన్నారు. గత కొన్ని నెలలుగా నెలకొన్న తీవ్ర హింస వలసలకు కారణమవుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed