- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: ఇబ్రహీంపట్నంలో తీవ్ర విషాదం.. యువతి అనుమానాస్పద మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని దండు మైలారంలో గ్రామంలో ఇవాళ చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన భవాని అనే యువతి ఉన్నట్టుండి ఫ్యాన్‌కు ఉరేసుకుని అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు విడిచింది. కాగా, గత కొంతకాలంగా భవానికి, కుటుంబ సభ్యల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్థులు మాత్రం భవానిని సొంత కుటుంబ సభ్యులే హతమార్చారంటూ ఆరోపిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సెక్షన్-174 కింద కేసు నమోదు చేసుకుని మృతురాలి తండ్రి సోదరిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story