- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Breaking: డ్రగ్స్ పెడ్లర్ షేక్ బిలాల్ అరెస్ట్.. రూ.12 లక్షల సరుకు స్వాధీనం

X
దిశ, వెబ్‌డెస్క్: జొమాటో డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సప్లై చేస్తున్న డ్రగ్స్ పెడ్లర్ షేక్ బిలాల్‌ను ఆరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. ఈ మేరకు మాదాపూర్ ఏరియాలో డ్రగ్ సప్లయ్ చేస్తుండగా నిందితుడు షేక్ బిలాల్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు అతడి నుంచి రూ.12 లక్షలు విలువ చేసే 23 కిలోల గంజాయి, 15 గ్రాముల ఎండీఎంఏ, హాష్ అయిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో భాగంగా అతడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ విక్రయించినట్లుగా తేలింది. ఇప్పటికే అందులో 45 మంది ఐటీ ఉద్యోగులను గుర్తించామని డీసీపీ వినీత్ తెలిపారు. కాగా, గతంలో ఎన్‌డీపీఎస్ కేసులో నిందితుడు షేక్ బిలాల్ జైలుకు కూడా వెళ్లాడు.
Next Story