బిగ్ బ్రేకింగ్ : మెట్ పల్లి పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య

by Shiva |   ( Updated:2023-08-20 21:27:21.0  )
బిగ్ బ్రేకింగ్ : మెట్ పల్లి పట్టణంలో అర్ధరాత్రి దారుణ హత్య
X

కన్నం సతీష్ అనే వ్యక్తిని కిరాతకంగా హతమార్చిన దుండగులు

దిశ, మెట్ పల్లి : అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన మెట్ పల్లి పట్టణంలోని వేంకట్రావ్ పేట కాలనీలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. దీంతో మెట్ పల్లి పట్టణంలో ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్సై శ్యాంరాజ్ కథనం మేరకు.. వెంకట్రావ్ పేట్ కాలనీలో ఓ బార్ వద్ద పట్టణంలోని చావిడి ప్రాంతానికి చెందిన కన్నం సతీష్ గుర్తు తెలియని దుండగులు అతి కిరాతకంగా కొట్టి హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు.. హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అప్పటికే సతీష్ మృతి చెందినట్లుగా పోలీసులు ధృవీకరించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఎస్సై శ్యాంరాజ్ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed