ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం.. కారులోనే ఒకరు సజీవ దహనం

by Disha Web Desk 12 |
ఔటర్ రింగు రోడ్డు పై ప్రమాదం.. కారులోనే ఒకరు సజీవ దహనం
X

దిశ, పటాన్ చెరు: ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే రింగ్ రోడ్డు పై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఒకరు సజీవ దహనం అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో మేడ్చల్ నుంచి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్‌ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.. కారు పూర్తిగా దగ్ధం అవ్వడంతో పోలీసులు కార్ నెంబర్ ను గుర్తించి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed