HYD: నకిలీ ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

by GSrikanth |   ( Updated:2023-08-29 10:27:35.0  )
HYD: నకిలీ ఇంజక్షన్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. బాడీ బిల్డింగ్ కోసం వినియోగించే నిషేధిత ఇంజక్షన్లు, డ్రగ్స్ ముఠా విక్రయిస్తుండగా కొల్లూరు, ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు చాంద్రాయణ గుట్టకు చెందిన అహమ్మద్ బిన్ అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ ఇబ్రహీంలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షలు విలువచేసే నిషేధ ఇంజక్షన్లతో పాటు ఒక చరవాణి, జిమ్ విసిటింగ్ కార్డ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.

Advertisement

Next Story