- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. చిక్‌బల్లాపూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాత పడ్డారు. శనివారం రాత్రి చిక్‌బల్లాపూర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను బయటకు తీశారు. మృతులు బెంగళూరు రేవా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story