అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

by Shiva |   ( Updated:2023-06-02 13:56:38.0  )
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
X

దిశ, రాజంపేట : అనుమానాస్పద స్థితిలో యువతి ఉరేసుకుని మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి తోడంగల లక్ష్మీనర్సవ్వ కూతురే తొడంగుల భవ్య శ్రీ. గురువారం లక్ష్మీనర్సవ్వ తన మేనమామ అల్లుడైన నర్సింహులు ఆరుగొండ గ్రామానికి అంతక్రియల నిమిత్తం ఉదయం 11 గంటలకు బయలుదేరి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చింది. ఇంటి లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టి ఉంది. లోపల ఉన్న తన కూతరు భవ్య శ్రీని ఎంత పలిచినా పలుకలేదు.

దీంతో చుట్టుపక్కల వారి సాయంతో వెంటనే తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా భవ్య శ్రీ దూలానికి ఉరేసుకుని ఉంది. హుటాహుటిన కిందకి దింపి చూడగా తాను అప్పటికే ప్రాణాలు విడిచింది. చనిపోయిన భవ్య శ్రీ అప్పుడప్పుడు ఫోన్లో గంటల కొద్దీ మాట్లాడేదని తల్లి లక్ష్మీనర్సవ్వ తెలిపింది. ఫోన్ కాల్ డేటా ఆధారంగా తన కూతురు చావుకి కారణమైన వారిని పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకోగలరని మృతురాలి తల్లి పోలీసులను వేడుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed