నకిలీ బాబాకు దేహశుద్ధి

by Javid Pasha |
నకిలీ బాబాకు దేహశుద్ధి
X

దిశ, వెబ్ డెస్క్: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలను వైద్యం పేరుతో లైంగికంగా వేధిస్తున్న ఓ నకిలీ బాబాకు మహిళా సంఘాల ప్రతినిధులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగింది. తొర్రూరుకు చెందిన ఓ వ్యక్తి తనను తాను బాబాకు చెప్పుకుతిరుగుతున్నాడు. మానసిక ఇబ్బందులు ఉన్న మహిళలను టార్గెట్ గా చేసుకొని వైద్యం పేరు చెప్పి వారిని లోబర్చుకుంటున్నాడు. ఇలా ఎన్నో్ ఏళ్లుగా సాగుతున్న అతడి గుట్టును హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ రట్టు చేసింది.

తనను వైద్యం పేరుతో శారీరకంగా లోబర్చుకున్నాడని, తను చెప్పినట్లు చేయకపోతే వీడియోలు బయటకు రిలీజ్ చేస్తానంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే సదరు మహిళ మహిళా సంఘాల ప్రతినిధులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా రెక్కీ నిర్వహించిన మహిళా సంఘాల నేతలు సదరు దొంగ బాబాను దొరకబట్టి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు.

Advertisement

Next Story