- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళపై అత్యాచారం చేసి.. క్రూరంగా హింసించి ఆపై దారుణంగా..
దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖపట్టణం జిల్లా తగరపువలస జాతీయ రహదారికి సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.మహిళపై అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమెను అత్యంత క్రూరంగా హింసించి చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 11న రాత్రి గుర్తు తెలియని మహిళ మృతదేహం పడి ఉందని భీమిలి పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. అయితే ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మృతురాలిని విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 32 ఏళ్ల వివాహితగా గుర్తించారు. ఆమె తమ గ్రామ సమీపంలోనే ఓ కంపెనీలో పనిచేసేదని తెలిసింది. భర్త ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే తొలుత ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం అత్యంత క్రూరంగా హింసించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంత దారుణంగా హత్య చేయడానికి కారణాలు ఏంటి..? ఎవరు ఈ హత్యకు పాల్పడి ఉంటారు అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.