గృహిణి అదృశ్యం వెకన కారణాలు అవే..

by Sumithra |
గృహిణి అదృశ్యం వెకన కారణాలు అవే..
X

దిశ, దోమ : భర్త మందలించాడని భార్య కొడుకుతో పాటు అదృష్యమైన సంఘటన దోమ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. దోమ ఎస్సై విశ్వజన్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గుండాల్ గ్రామానికి చెందిన కోళ్ల నర్సిములు (33)కు అదే గ్రామానికి చెందిన కోళ్ల పెంటప్ప కూతురు నవనీత (28)తో ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు సంతానం.

గత కొన్ని రోజులుగా రాత్రి పది గంటల తరువాత భార్య నవనీత ఫోన్ కు పదే పదే ఫోన్ రావడంతో తనను మందలించానని, ఇదే ఆదునుగా భావించిన భార్య నవనీత కొడుకు నవదీప్(3) తో కలిసి అదృశ్యమయ్యిందని చెప్పాడు. చుట్టుపక్కల తెలిసిన వారి దగ్గర, బంధువుల దగ్గర ఎంత వెతికినా ఆచూకీ లభించడం లేదని కోళ్ల నర్సిములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విశ్వజన్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed