పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

by Sridhar Babu |
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య
X

దిశ, బోథ్ : పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి బోథ్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుట్ట పక్క తండా గ్రామానికి చెందిన చావాన్ సెవంతా బాయి (51 )కి భర్త, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. వీరి కుమారులకు, కూతురుకు వివాహాలు అయ్యాయి. ఇంట్లో చవాన్ సెవంతా బాయ్ కి చిన్న కోడలికి చిన్నపాటి గొడవ జరగడంతో దీనికి తీవ్ర మనస్తాపం చెందింది.

శుక్రవారం చవాన్ సెవంతా బాయి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో బహిర్భూమికి అని వెళ్లింది. చాలాసేపు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని చూసి కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు వాహనంలో బోథ్ CHC ఆసుపత్రికి తీసుకురాగా అక్కడి డాక్టర్లు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed