- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూడ్ వీడియోలతో.. కుచ్చుటోపి
బాధితుడి నుంచి రూ.61 వేలు కాజేసిస వైనం
దిశ, సిద్దిపేట ప్రతినిధి : న్యూడ్ వీడియోలను పంపి బాధితుడి నుంచి సైబర్ నేరస్థుడు డబ్బు కాజేసిన ఘటన గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బాధితుడు గుర్తు తెలియని సైబర్ నేరస్థుడు న్యూడ్ వీడియోలు వాట్సప్ ద్వారా పంపించాడు. తదుపరి బాధితుడిని మాటల్లో పెట్టి సైబర్ నేరస్థుడు సదరు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించగా బాధితుడు మూడు విడతల్లో రూ.61,450 పంపించాడు. చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు డేటింగ్ ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేసి అందులోని ఫోన్ నెంబర్ కు ఫోన్ చేశాడు.
ఈ మేరకు సైబర్ నేరస్థుడు సూచించిన విధంగా ఫోన్ ఫే ద్వారా రూ.17,200 పంపించాడు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడికి సైబర్ నేరస్థుడు ఫోన్ చేసి డాటా ఎంట్రీ జాబ్ ఉందని నమ్మబలికాడు. నేరస్థుడు సూచించిన విధంగా బ్యాంక్ వివరాలు, ఓటీపీ నెంబర్ బాధితుడు తెలిపిన వెంటనే అకౌంట్ లో నుంచి రూ.9 వేలు డెబిట్ అయ్యాయి. ఆయా ఘటనల్లో బాధితులు జాతీయ సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా సీపీ శ్వేత మాట్లాడుతూ..సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బు రికవరీ చేసే అవకాశం ఉంటుందన్నారు.