భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని భార్య సూసైడ్.. ప్రతి రోజు 50 ఐ లవ్ యూ మెసేజ్‌లు.. చివరకు!

by Anjali |   ( Updated:2023-06-20 14:29:50.0  )
భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని భార్య సూసైడ్.. ప్రతి రోజు 50 ఐ లవ్ యూ మెసేజ్‌లు.. చివరకు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో చాలామంది చిన్న చిన్న కారణాలతో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులో పట్టుకొట్టై నాటుచాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. సతీష్ (28) అనే వ్యక్తి 22 ఏళ్ల సువితను నెల క్రితం వివాహం చేసుకున్నాడు. కాగా, భర్త పని మీద బయటకు వెళ్తే, రోజుకు 50 సార్లు ‘ఐ లవ్ యూ’ అని మేసేజ్‌లు పంపించుకునేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. ఒక రోజు భర్తకు, భార్య ఫోన్ చేస్తే అతడు కాల్ లిఫ్ట్ చేయకపోయే సరికి ఆమె తీవ్ర మనస్తాపానికి గురై.. ఆదివారం 3.45 గంటలకు ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న సతీష్ సువితను వెంటనే స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు తెలుపడంతో ఆ బాధను తట్టుకోలేక సతీష్ సోమవారం తెల్లవారుజామున 3.45 గంటలకు చీరతో ఊరేసుకుని మరణించాడు. పెళ్లై నెల గడవముందుకే ఎంత పని చేశారు బిడ్డా? అంటూ ఇరు కుంటుంబాలు గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు.

Also Read.

భర్త శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

గొలుసులతో కట్టేసి అత్యాచారం.. పూర్ణానంద స్వామిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన 12 ఏళ్ల బాలిక..!

Advertisement

Next Story