26 ఏళ్ల యువకుడి కడుపులో వోడ్కా బాటిల్.. స్నేహితుల పైనే అనుమానం..?

by Mahesh |
26 ఏళ్ల యువకుడి కడుపులో వోడ్కా బాటిల్.. స్నేహితుల పైనే అనుమానం..?
X

దిశ, వెబ్‌డెస్క్: కడుపునొప్పితో హస్పత్రికి వచ్చిన ఓ యువకుడి కడుపులో డాక్టర్లు వోడ్కా బాటిల్‌ను గుర్తించారు. నేపాల్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడి కడుపు నుంచి వోడ్కా బాటిల్‌ను డాక్టర్లు శస్త్రచికిత్స చేసి బయటకు తీశారు. ఆ బాటిల్ ను యువకుడి ప్రైవేట్ పార్ట్ నుంచి బలవంతంగా లోపలికి చొప్పించడంతో అతని కడుపులో పేగును అది చీల్చివేసింది. దీనివల్ల మలం లీకేజీ కావడం, కడుపులో ప్రేగులు వాపు చెందడం జరిగిందని డాక్టర్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు తెలిశాయి. అతని స్నేహితులు తాగి వచ్చి బలవంతంగా అతని ప్రైవేట్ పార్ట్‌లో వోడ్కా బాటిల్‌ను చోప్పించినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed