ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Shiva |   ( Updated:2023-05-27 08:53:15.0  )
ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, గంభీరావుపేట : ఉరేసుకుని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన గంభీరావుపేట మండలం లింగన్నపేట శివారులోని చిప్పలపల్లి అడవి ప్రాంతంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేష్ తెలిపిన వివరాల ప్రకారం.. చిప్పలపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతుడు రెడ్ కలర్ బనియన్, నలుపు కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడి కుడి చేతిపై బోధ భాయ్ అనే పేరుతో పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా, యూపీ రాష్ట్రాలకు చెందిన వాడిగా అనుమానిస్తున్నారు. రైస్ మిల్స్, ఐకేపి సెంటర్ లారీలపై ఇండస్ట్రీ ప్రాంతాల్లో పని చేసే వ్యక్తిగా అనుమానిస్తున్నారు. ఎవరికైనా మృతుడి వివరాలు తెలిస్తే.. గంభీరావుపేట పోలీసులకు సమాచారం అందజేయాలని ఎస్సై మహేష్ కోరారు.

Advertisement

Next Story