- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్రం కోసం వాగులోకి వెళ్లిన ఇద్దరు యువకులు, గుర్రం మృతి..
దిశ, శంషాబాద్ : గుర్రం వాగులోకి వెళ్లిందని కాపాడబోయి ఇద్దరు యువకులు, గుర్రం మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ వాగులో చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన అశుసింగ్, కిషన్ బాగ్ కు సైఫ్ ఇద్దరి యువకులు గుర్రం పై హాట్స్ రేసింగ్ చేసుకుంటూ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిస్మత్పూర్ వైపు వెళుతుండగా అక్కడ ఉన్న ఈసా వాగులోకి గుర్రం ఈడ్చుకొని వెళ్లడంతో అశుసింగ్ (19), సైఫ్ (20) ఇద్దరు యువకులు వాగులోకి దిగారు.
ఇద్దరికీ ఈత రాకపోవడం వల్ల వాగులో గల్లంతే గుర్రంతో పాటు ఇద్దరు యువకులు మృతి చెందినట్లు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాగులో గల్లంతైన ఇద్దరు మృతదేహాలతో పాటు గుర్రాన్ని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరు యువకుల మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.