ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు యువకుల మృతి

by Shiva |   ( Updated:2023-05-16 15:44:23.0  )
ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు యువకుల మృతి
X

మిరుదొడ్డి మండల కేంద్రంలో ఘటన

దిశ, మిరుదొడ్డి : ప్రమాదవశాత్తు వాగులో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మిరుదొడ్డి మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మిరుదొడ్డి ఎస్సై శ్రీధర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం చేర్వాపూర్ పిట్టలవాడకు చెందిన గుజరాతి మల్లేశం (17), గుజరాతి విష్ణు (17), గుజరాతి సుధాకర్ (19) అనే ముగ్గురు యువకులు సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఈత కొట్టేందుకు మిరుదొడ్డి మండల కేంద్రంలోని కూడవెల్లి వాగులోకి దిగారు.

అయితే, ప్రమాదవశాత్తు గుజరాతి మల్లేశం, గుజరాతి విష్ణు నీట మునిగి ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో గుజరాతి సుధాకర్ వారిని రక్షించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేశాడు. కానీ, ఫలితం విఫలమవడంతో స్థానికులకు సమాచారం అందజేశాడు. దుబ్బాక సీఐ మెన్నె కృష్ణ తన సిబ్బందితో, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, మండల తహసీల్దార్ మృతదేహల వెలికితీతకు వాగు వద్దకు చేరుకున్నారు. అనంతరం స్థానిక గజ ఈతగాళ్ల సహకారంతో మృతదేహాలను వెలికి తీయించారు.

ఈ మేకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదేవిధంగా మృతదేహాలను వెలికి తీసేందుకు సహకరించిన లింగుపల్లి గ్రామానికి చెందిన కిషన్, నర్సింహులు, మహేష్, నవీన్, నాగరాజులను మిరుదొడ్డి ఎస్ఐ శ్రీధర్ గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈత రాని వారు ఎవరైనా అప్రమత్తంగా ఉండాలని, బావుల్లోకి, చెరువులు, వాగుల్లోకి దిగి ప్రాణాలను పోగొట్టకోవొద్దని పోలీస్ శాఖ తరపు నుంచి హెచ్చరించారు.

Advertisement

Next Story