- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
దిశ, కొత్తగూడెం రూరల్ : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కరుణాకర్ వెల్లడించారు. భద్రాచలం పట్టణానికి చెందిన గుమ్మడి రాజు గత కొంతకాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తూ జల్సాలకు పాల్పడుతున్నట్లుగా పేర్కొన్నారు.
సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం రాత్రి బస్టాండ్ సెంటర్లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనబడిన రాజును విచారించగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అతని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఇటీవల ఖమ్మంలో 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 6 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్లగా అంగీకరించినట్లు తెలిపారు. పట్టుబడిన రాజు నుండి 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. దొంగను అదుపులోకి తీసుకోవడంలో కృషిచేసిన కానిస్టేబుళ్లు శంకర్, సురేష్, నరేష్ లను డీఎస్పీ అబ్దుల్ రహమాన్ ప్రత్యేకంగా అభినందించినట్లుగా సీఐ కరుణాకర్ తెలిపారు.